Search
Saturday 22 September 2018
  • :
  • :

‘గీత గోవిందం’లో ఆ ముద్దు సన్నివేశం తొలగించారట..?

Geetha Govindam Kiss Scenes

హైదరాబాద్: ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో ముద్దు(కిస్సింగ్) స‌న్నివేశాలు కామ‌న్ అయిపోయాయి. యువతను థియేటర్స్ కి ర‌ప్పించాలంటే ఇవే కీల‌కమ‌నే విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పసిగట్టిన‌ట్టున్నారు. దాంతో ఏమాత్రం అవ‌కాశం ఉన్నా వాటిని సినిమాల్లో చూపించేస్తున్నారు. తెలుగు చిత్రాల ముద్దుల గురించి మాట్లాడితే మొద‌ట గుర్తుకొచ్చే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’. అంత‌కుముందు చాలా సినిమాల్లోనూ, ఆ త‌ర్వాత వచ్చిన చిత్రాల్లోనూ ముద్దులున్నాయి కానీ, ‘అర్జున్‌రెడ్డి’లో ఉన్న‌న్ని ముద్దు సన్నివేశాలు మాత్రం వేరే చిత్రాల్లో లేవనే చెప్పాలి. ఇక ఇటీవల విడుదలైన బోల్డ్ కంటెంట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’లో కూడా ఈ సన్నివేశాలు బాగానే చూపించారు. ఇదిలాఉంటే తాజాగా విడుదలైన ‘గీత గోవిందం’లోనూ ఓ ముద్దు సన్నివేశాన్ని ప్లాన్ చేశారట. కానీ దాన్ని చివరి నిమిషంలో తొలిగించారని, దానికి కారణం హీరోయిన్ రష్మిక మందన అని తెలుస్తోంది.

అసలు పుకారు ఏమిటంటే: బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మీన్ పేరు వినగానే గుర్తొచ్చేది ముద్దుల సన్నివేశాలే. అలాగే హీరో విజయ్ అంటే కూడా ‘అర్జున్‌రెడ్డి’ నుంచి యువతలో ఆయనపై ఇలాంటి ఒపినియన్ నెలకొంది. దీంతో ఆ విష‌యంలో డిజ‌ప్పాయింట్ చేయ‌కూడద‌నుకున్నారో ఏమో గానీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా వచ్చిన ‘గీత గోవిందం’లోనూ ఓ ముద్దు సీన్ ప్లాన్ చేశారట చిత్ర బృందం. నిజానికి ఇది ముద్దు చుట్టూ తిరిగే క‌థని సినిమా చూస్తే తెలుస్తోంది. బ‌స్సులో ముద్దు గురించే గొడ‌వంతా. అయితే, సినిమా క్లైమాక్స్‌ లో కూడా చిత్ర యూనిట్ ఓ మంచి ముద్దు స‌న్నివేశం షూట్ చేశారని. అది చాలా ఘాటు ముద్దు సన్నివేశమని, హీరోహీరోయిన్ ఒక‌రిపై మ‌రొక‌రు కూర్చుని ముద్దు పెట్టుకుంటారట. కానీ, మూవీలో మాత్రం దాన్ని చూపించ‌లేదు. ఇద్ద‌రూ ముద్దు కోసం ద‌గ్గ‌ర‌వ‌డంతో టైటిల్ కార్డ్స్ ప‌డిపోయాయి. దీంతో కావాల‌నే ఆ ముద్దు సీన్ క‌ట్ చేశార‌ని సమాచారం. ఈ మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందే కథనాయిక ర‌ష్మిక పెళ్లిపై పుకార్లు రావ‌డంతోనే అలా చేశార‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ర‌ష్మిక కోరిక మేరకే ఆ ముద్దుని అలా ఆపేశార‌ని తెలిసింది. ఇది బయటకు ఎలా వచ్చిందో తెలుసా? మూవీ రిలీజ్‌కి ముందే కొన్ని సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. కాగా, లీకైన వెర్ష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య చివరలో వచ్చే ఆ ముద్దు సీన్ ఉంద‌ట‌. ఇదీ అసలు మ్యాట‌రన్నమాట.

Comments

comments