Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

‘25 స్టిల్ వర్జిన్’!

vjd

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరుశురాం దర్శకత్వంలో జెఎ2 పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. బన్ని వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా ‘25 స్టిల్ వర్జిన్’ అనే క్యాప్షన్‌తో  సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక గీత పాత్రలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ “గీత గోవిందం చిత్రం విజయ్ దేవరకొండకు మరింత పేరు తెచ్చిపెడుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పరుశురాం మా బ్యానర్‌లో రెండవ చిత్రం చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర పేరు గీత. ఈ చిత్రం తర్వాత తనను గీత అని పిలుస్తారు. అంత బాగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తాం”అని అన్నారు. దర్శకుడు పరుశురామ్ మాట్లాడుతూ “గీతా ఆర్ట్‌లో ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ గోవిందం అనే పాత్రలో నటిస్తున్నాడు. అతను చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అందరినీ అలరిస్తాడు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్‌తో మా గోవిందం పాత్ర తీరు తెలుస్తుంది”అని పేర్కొన్నారు. నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ “మా గోవిందం అలియాస్ విజయ్ దేవరకొండ సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పరుశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీత, గోవిందం చేసే అల్లరి యూత్‌ని ఆకట్టుకుంటుంది”అని అన్నారు. నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల  కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః మణికందన్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః రమణ వంక, కొరియోగ్రఫీః రఘు, జాని, పాటలుః అనంత్ శ్రీరామ్, శ్రీమణి

Comments

comments