Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘గీత గోవిందం’ సెన్సార్ పూర్తి…

Geetha govindam movie release on august 15

ఫిలింనగర్: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా ‘గీత గోవిందం‘ సిన్మా రూపొందింది. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించారు. అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు,ఎ సర్టిఫికేట్ ను పొందింది.  ఈ సిన్మా ఆగష్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించామని పేర్కొన్నారు. అల్లు అరవింద్ ఆశీస్సులతో బన్నీ వాసు సహకారంతో ఈ సిన్మాను అనుకున్నటైమ్ కి పూర్తి చేశామని చెప్పారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, అభిమానులు కోరుకునే అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఈ సినిమాను తీసామన్నారు. గోపీసుందర్ అందించిన సంగీతానికి లభించిన ఆదరణ ఎంతో సంతోషాన్నికలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఈ సినిమాపై వుందన్నారు.

Comments

comments