Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

తమిళనాడులోనూ రికార్డు

Geetha Govindam rakes in Rs 100 crore

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ఇప్పటికే 100 క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో విజయ్‌కి హీరోగా మరింత పాపులారిటీ వచ్చింది. అంతేకాదు తమిళనాడులోనూ ఈ చిత్రం సరికొత్త రికార్డును అందుకుంది. బాహుబలి-2 సినిమా తర్వాత తమిళనాడులో మహేష్ సినిమాలకు కొన్ని రికార్డులున్నాయి. ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపు 5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. తమిళనాడు యువత నుంచి సినిమాకు అనూహ్య స్పందన రావడంతోనే ఈ వసూళ్లు సాధ్యమయ్యాయట. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న  చెన్నై, కోయంబత్తూర్, మధురై  ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

Comments

comments