Search
Wednesday 26 September 2018
  • :
  • :

విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అవుతాడు

Gita-Govindamవిజయ్ దేవరకొండ, రష్మిక మండన్న హీరోహీరోయిన్లుగా పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్  సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గోపిసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “బన్నీ వాసు కోసమే ఈ వేడుకకు వచ్చాను. ఈ సినిమా నేను చూశాను. చాలా బావుంది.  రెండు సంవత్సరాల క్రితం ఈ కథ విన్నాను. ఈ సినిమాలో విజయ్, రష్మిక చక్కగా నటించారు. గోపిసుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘పరుగు’ సినిమా సమయంలో పరుశురాంని అసిస్టెంట్ డైరెక్టర్‌గా చూశాను. ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ దర్శకుడిగా ఎదిగారు. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటనకుగాను విజయ్ దేవరకొండకు ఫిలింఫేర్ అవార్డు రావాలని అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే తనకు ఈ అవార్డు వచ్చింది. తెలుగులో మంచి నటులు చాలా మంది ఉన్నారు. కానీ కొద్దిమందే గొప్ప నటులు ఉన్నారు. అలాంటి కొద్దిమందిలో విజయ్ ఒకరు”అని తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “శ్రీరస్తు శుభమస్తు సినిమా సమయంలో పరుశురాం ఈ సినిమా లైన్‌ను వినిపించాడు. నువ్వు కథలో వేసిన ముడి చాలా బావుంది. ఆ ముడి విప్పి నాకు కథ చెప్పు అంటే… ఆరు నెలల తర్వాత వచ్చి గంట సేపు పూర్తి కథ చెప్పాడు. కథ నచ్చడంతో సంవత్సరం తర్వాత సినిమాను ప్రారంభించాం. సినిమాలో విజయ్, రష్మిక అద్భుతంగా నటించారు. గోపిసుందర్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని ఓ పాటకు 27 మిలియన్ హిట్స్ వచ్చేటట్లు చేసిన ఘనత గోపిసుందర్‌దే”అని అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ “ఈ కథకు హీరో ఎవరు అని వెతుకుతున్నప్పుడు ‘పెళ్లిచూపులు’ విడుదలైంది. అందులో నటించిన విజయ్ దేవరకొండలో మ్యాజిక్ ఉందనినిపించి అతనితో ఈ సినిమా చేశాం. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత విజయ్ పెద్ద స్టార్ అవుతాడనిపించింది. ఈ చిత్రంతో రష్మికకు మంచి పేరు వస్తుంది”అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను పాడిన పాట సెన్సేషనల్ అవుతుందనుకుంటే మరో రకంగా సెన్సేషన్ అయింది. హీరోగా నాకు మరింత పేరు తెచ్చే చిత్రమిది”అని చెప్పారు. దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ “నా రెండు సంవత్సరాల కష్టమే ఈ సినిమా. విజయ్ దేవరకొండ, రష్మికలకు ఈ సినిమా రాసి పెట్టి ఉంది. గోవిందం పాత్రను నేను అనుకున్న దాని కంటే బాగా చేశాడు విజయ్. గోపీసుందర్ మంచి సంగీతాన్ని అందించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో  గోపీసుందర్, రష్మిక మండన్నతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments