Home జాతీయ వార్తలు రాజస్థాన్ సిఎంగా గెహ్లాట్.. డిప్యూటీ సిఎం సచిన్

రాజస్థాన్ సిఎంగా గెహ్లాట్.. డిప్యూటీ సిఎం సచిన్

rahul gandhi sachin pilot ashok gehlotన్యూఢిల్లీ: రెండు రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొన్నారు. రాజస్థాన్ సిఎం రేసులో ఉన్న ఈ ఇద్దరు నాయకులు శుక్రవారం రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీలో అసమ్మతి తలెత్తకుండా ఉభయులకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎఐసిసి పరిశీలకుడు కెసి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాహుల్ కూడా తన ట్విట్టర్‌లో ఆ ఇద్దరు నాయకులతో కలసి చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు.

Gehlot made CM of Rajasthan

Gehlot made CM of Rajasthan, Sachin Pilot is Dy CM of Rajasthan, Congress president Rahul Gandhi ends the suspense