Search
Sunday 23 September 2018
  • :
  • :

ప్రేమ మధురం…. పెళ్లి మిథునం

ప్రేమే గెలిపించింది…

Lover-Valantine-Day

ఇద్దరూం అనుకోకుండా కలిశాం. అనుకోకుండానే పరిచయమైంది. కానీ ఇద్దరం జీవితాంతం కలిసుంటామని ఎందుకో అనిపించింది. ఇద్దరి మనసులోని భావాలను పంచుకున్నాం. జీవితాంతం ఆనందంగా ఉంటామని అనిపించింది. విషయాన్ని ఇద్దరం ఇళ్లల్లో చెప్పేశాం. చివరికి భద్రాద్రి రామయ్య సాక్షిగా ఒక్కటయ్యాం. ఇద్దరి మధ్య కావాల్సినంత అనునయముంది. మంచి ఉద్యోగం. జీవించడానికి సరిపోయేంత జీతం. జీవితం హాయగా గడుస్తోంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఒక్క క్షణం ఆగిపోతే.. జీవితమే ఆగిపోయేదేమో అని.
రాయల నవీన్, నిహారిక, జానంపేట

నా జీవితానికి తనే వెలుగు…

నా పేరు అరికిళ్ల నరేష్. మాది జయశంకర్ జిల్లా రాజుపేట. డిగ్రీ చదివేటప్పుడు స్వాతి పరిచయమైంది. రెండేళ్లపాటు ప్రేమ ఎంతో మధురంగా సాగింది. ఆ తర్వాత సరదాగా సాగిపోయే జీవితంలో ఆలోచన మొదలైంది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంతో భయమైంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. కానీ ఇప్పుడు ఆలోచిస్తే.. ఇక జీవితాంతం చీకటే ఉంటుందని మాత్రం మనసు చెబుతూనే ఉంది. వెంటనే పెళ్లి చేసుకుందామని తనకు చెప్పాను. చెప్పింది తడవుగా నా వెంట నడవాటిని సై అనేసింది. ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఇద్దరం పెళ్లి చేసేకున్నాం. తర్వాత ఎనో ఒడిదొడుగులు. కానీ ఎప్పుడూ తన మాత్రం నా వెన్నంటే ఉంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు. జీవితం చాలా ఆనందంగా ఉంది. వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే.. నా జీవితానికి తనే వెలుగు.
ఎ.నరేష్, స్వాతి, మణుగూరు

బాధ్యతను నేర్పింది…

ప్రేమ బాధ్యతను నేర్పింది. ప్రేమ జీవితాన్ని పరిచయం చేసింది. ఎలా బతకాలో తెలియనప్పుడు గమ్యాన్ని చూపింది. మా పెళ్లి ఇప్పటికీ ఓ కలేనేమో అనిపిస్తోంది. తొలిత కాస్త ఇబ్బందులు పడినప్పటికీ.. ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న సఖ్యతే మా జీవితాన్ని
నడిపిస్తోందేమో అనిపిస్తోంది.
ఎన్.రాజేష్, అనూష, మణుగూరు

Comments

comments