Home జాతీయ వార్తలు కానిస్టేబుల్ సాల్వేకు లింగమార్పిడి శస్త్ర చికిత్స

కానిస్టేబుల్ సాల్వేకు లింగమార్పిడి శస్త్ర చికిత్స

 Gene conversion surgery to Constable Salve

ముంబయి: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ లలితా సాల్వే(29) అనే హిజ్రాకు శుక్రవారం  ప్రభుత్వ సెయింట్ జార్జి  ఆస్పత్రిలో మొదటిదశ లింగ మార్పిడి శస్త్ర చికిత్స (సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ) జరిగింది. అనంతరం ప్లాస్టిక్ సర్జన్ డా.రజత్ కపూర్ మాట్లాడుతూ  సాల్వేకు మొదటి దశ ఆపరేషన్ విజయవంతమైందని, ఆరు నెలల తర్వాత రెండో దశ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కన్నా ముందు సాల్వేకు ఎక్స్ రే, ఇసిజి, రక్త పరీక్షలు నిర్వహించినట్లు కపూర్  తెలిపారు. మజల్‌గాంలో పిఎస్‌లో  పనిచేస్తున్న సాల్వే, శస్త్ర చికిత్స కోసం తనకు సెలవు మంజూరు చేసేలా డిజిపిని ఆదేశించాలని గతంలోబాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఆమెకు  లింగమార్పిడికి అనుమతిచ్చింది. 29 ఏళ్లు మహిళగా జీవించానని, ఇప్పటి నుంచి ‘లలిత్’ పేరుతో  కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు అంతకు ముందు సాల్వే తెలిపింది.