Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మందులు

వికారాబాద్, పరిగి, తాండూరులలో ఏర్పాటుకు చర్యలు
ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం :జిల్లా కలెక్టర్ దివ్య

GENERIC

మనతెలంగాణ/వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరిక్ మందులను ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. హైద్రాబాద్‌కు అతి దగ్గర్లో ఉన్న వికారాబాద్ జిల్లా వెనుకబడి ఉన్నదని ఆమె గ్రహించారు. ఆరోగ్యంతోపాటు విద్య, మరుగుదొడ్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.

వికారాబాద్‌లో పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, తాండూరులోని జిల్లా ఆసుపత్రి, పరిగిలోని ఏరియా ఆసుపత్రులను ఆమె తనిఖీ చేసి ఆసుపత్రుల పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ మూడు ఆసుపత్రులలో జీవన్‌ధార పథకం కింద జనరిక్ మందులు విక్రయిస్తే ఇక్కడికి వచ్చే సామాన్యులకు కొత్త మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జనరిక్ మందులు విక్రయించడానికి అధికారులు సంసిద్ధత  వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీలైనంత త్వరలోనే జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ తెలిపారు.

Comments

comments