Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రాగివంగడంలో జన్యు క్రమబద్ధీకరణ

Maise

కర్ణాటక వ్యవసాయ శాస్త్రవేత్తలు రాగివంగడం జన్యుక్రమాన్ని అనుక్రమం చేశారు. దీనివల్ల పోషక విలువలు సమృద్ధిగా పెరగడమే కాక, దుర్భిక్షాన్ని తట్టుకునే సామర్థం పెరిగింది. బెంగుళూరుకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్  బెంగుళూరు (యుఎఎస్‌బి) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల్లో విజయం సాధించారు. దాదాపు ౩ వేల సంవత్సరాలకు పూర్వం భారతదేశానికి రాగి పంట గురించే తెలీదు. ఉంగాడా పశ్చిమ ప్రాంతం, యూథోపియన్ కొండ ప్రాంతాల నుంచి భారత దేశానికి రానురాను చేరువైందని శాస్త్రవేత్తలు వివరించారు. రాగి జన్యు విశేషాలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది నాలుగేళ్ల ప్రాజెక్టు. మరిన్ని పరిశోధనలు జరిగితే కానీ పూర్తి వివరాలు బయటపడవు. పొడి నేలల్లో ఈ పంటను పండిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న తృణధాన్యాల్లో రాగి 12 శాతం వరకు స్థానం ఆక్రమించింది. రాజస్థాన్ తరువాత కర్నాటకలోనే ఈ పంటను విస్తారంగా సాగు చేస్తుంటారు.

తక్కువగా ముద్దయ్యే రాగి పేదలకు ముఖ్యమైన ఆహారంగా వినియోగమవుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాగితో ఆహారం తీసుకోడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. పాలిష్ తృణ ధాన్యాల రకాల కన్నా ప్రత్యామ్నాయ పంటగా రాగిని అంగీకరిస్తారు. కాల్షియం, ఐరన్ వంటి ధాతువులే కాక సులువుగా జీర్ణమయ్యే లక్షణాలు ఈ పంటలో ఉన్నాయి. ఈ వంగడంలోని డిఎన్‌ఎ న్యూక్టియోటైడ్స్‌ను జన్యుక్రమం గుర్తించ గలిగింది. ఈ జన్యుక్రమ ప్రాజెక్టులో డాక్టర్ శైలజా హిత్తల్‌మణి ఆధ్వర్యంలో 8 మంది సభ్యులు పని చేస్తున్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో మనగలిగే రాగి వంగడంలో  దుర్భిక్ష లక్షణాలను ఓర్చుకునే 2866 జన్యువులను గుర్తించామని వారు చెప్పారు.

ఈ జనువులను వరి, గోధుమ వంగడాల్లో మార్చగలిగితే పౌష్టిక విలువలు నెరగడంతో పాటు దుర్భిక్షాన్ని తట్టుకుని అధిక దిగుబడి సాధించే వరి, గోధుమ వంగడాలు తయారవుతాయని చెప్పారు. ఈ జన్యుక్రమబద్దీకరణ ప్రక్రి య వరి, గోధుమ వంగడాల్లోనూ సాధ్యం అవుతుందన్న నమ్మకం శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రాగిలో జన్యు క్రమబద్దీకరణ, ప్రపంచంలో మొట్టమొదటిసారి బెంగళూరులో జరిగింది. రాగి ఇంకా దుర్భిక్షాన్ని ఎదుర్కోగలిగే సత్తా సముపార్జించడానికి ఈ పరిశోధనలు తోడ్పడతాయి. ఈ శాస్త్ర విజ్నానం మరింత ముందుకు వెళ్తే మెట్ట ప్రాంత రైతులకు మేలు జరగడమే కాక వినియోగదారులకు పోషక విలువలు సమృద్ధిగా లభించే పంటలు లభిస్తాయి.

Comments

comments