Home నిజామాబాద్ ఉపాధి హామీకి జియో ట్యాగింగ్ అనుసంధానం

ఉపాధి హామీకి జియో ట్యాగింగ్ అనుసంధానం

ఆన్‌లైన్ వ్యవస్థతో.. నెరవేరనున్న పల్లె ప్రగతి
నిధులు కేటాయింపునకు కీలకం
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక
నూతన సంవత్పరంలో అమలుకు సన్నహాలు

National-Rural-Employment-G

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాంకేతిక హంగులు సంతరిం చుకుంటోంది. గ్రామాల్లో వలసలు నివారించడంతోపాటు, గ్రామీణ ప్రాంత సమగ్రాభి వృద్ధియే లక్షంగా కొత్త పుంతలు తొక్కనుంది. ఇందులో భాగంగా జాబ్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి పని కల్పించడంతో పాటు వారి నివాసాల వద్ద కనీస సదుపాయాలు గుర్తించి అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టబో తున్నారు. 2006 ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఉపాధిహామి పథకం క్రమంగా రూపుమారుతోంది. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం ఉపాధి కార్డు కలిగిన కుటుంబాలకు బహుళ ప్రయోజనా లు కల్పించాలనే లక్షంతో సర్వే చేపడుతున్నారు.
-మన తెలంగాణ/నిజామాబాద్ రూరల్

మన తెలంగాణ/నిజామాబాద్ రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాంకేతిక హంగులు సంతరిం చుకుంటోంది. గ్రామాల్లో వలసలు నివారించడంతోపాటు, గ్రామీణ ప్రాంత సమగ్రాభివృద్ధియే లక్షంగా కొత్త పుంతలు తొక్కనుంది. ఇందులో భాగం గా జాబ్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి పని కల్పించడంతో పాటు వారి నివాసాల వద్ద కనీస సదుపాయాలు గుర్తించి అందుకు అను గుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నారు. 2006 ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఉపాధి హామీ పథకం క్రమంగా రూపుమారుతోంది. ప్రస్తుతం మారిన నిబంధ నల ప్రకారం ఉపాధి కార్డు కలిగిన కుటుంబాలకు బహుళ ప్రయోజ నాలు కల్పించాలనే లక్షంతో సర్వే చేపడుతున్నారు.

 క్షేత్రస్థాయిలో సర్వే…

జాబ్‌కార్డు కలిగిన వారి ఇళ్ళకు వెళ్లి అవసరమైన వివరాలు సేకరిస్తారు. కూలీల ఫోటోలతో సహా అంతర్జాలంలో నమోదు చేస్తారు. కుటుంబాల వారిగా ఎన్ని పని దినాలు కావాలో తెలుసుకుంటారు. ఆ కుటుంబానికి ఇంకుడుగుంత, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఫామ్ ఫాండ్స్, వర్మి కంపోస్టు యూనిట్లు మొక్కలు ఉన్నాయా లేవా గుర్తిస్తారు. ఉంటే వాటిని సొంతం గా నిర్మించుకున్నారా, ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసుకున్నారా అనే వివరాలు సేకరించి ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. లేని పక్షంలో వారికేం కావాలో తెలుసుకొని నమోదు చేస్తారు.

అలా చేయడం వల్ల కుటుంబాలకి ఎంత బడ్డెట్ కేటాయించాలి అనే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా ఆయా పథకాల అమలుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వేగవంతంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.

లబ్దిదారులకు లాభదాయకం…
వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఒ పిడి

ఉపాధి హామీ పనులను జియో ట్యాగింగ్ పనులు సెప్టెంబరులో ప్రారం భం చేశాం. దీని ద్వారా కూలీలకు సత్వర న్యాయంతోపాటు లబ్ది దారులకు లాభదాయకం ఉంటుంది. ప్రతిరోజు జరుగుతున్న పనుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల పూర్తి సమాచారం తెలుసు కునే అవకాశం అధికారులకు ఉంటుంది. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు బ్యాంకు ద్వారా లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా వేయడం జరుగుతుంది.