Home బిజినెస్ జిఎస్‌టి ఎగ్గొట్టేందుకు ఎత్తులు

జిఎస్‌టి ఎగ్గొట్టేందుకు ఎత్తులు

gst

l నగదును డిమాండ్ చేస్తున్న వ్యాపారస్థులు
l లొసుగులను ఉపయోగించు కుంటున్న అక్రమార్కులు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) రూపకల్పన, అ మలులో భాగస్తుడైన ఆర్థికమంత్రి సీనియర్ అధికారి ఒక రు ఇటీవల ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ఉన్న జనరల్ స్టో ర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన చెల్లింపుకు తన కార్డును ఇ వ్వగా కౌంటర్‌లో ఉన్న వ్యక్తి జిఎస్‌టి ట్యాక్స్ పడకుండా ఉండాలంటే నగదు ఇవ్వమని అడిగాడు. దాంతో ఆయన అవాక్కయ్యారు. ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్‌కు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న అనేక ఎలక్ట్రానిక్ దుకాణాల్లో దు కాణుదారులు ఇదే తరహాలో 28శాతం జిఎస్‌టి పడకుం డా ఉండాలంటే నగదు ఇవ్వడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఫోటో స్టూడియో, ఇతర దుకాణాలకు వెళ్లినా ఇదే తంతుగా ఉంది. ఈ దుకాణాలన్నీ ఎక్కడో దూరాన కా కుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్న నార్త్ బ్లాక్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.
కచ్చా, పక్కా బిల్లుల విధానానికి జిఎస్‌టి మంగళం పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఆ యన కలలుకన్నా విధానం మాత్రం ఇంకా అమలులోకి రాలేదు. దీనికంతటికీ విధానంలో ఉన్న లొసుగులు కారణమని, వాటిని పూరించాల్సి ఉందని అధికారులు అం టున్నారు. జిఎస్‌టి చాంతాడంత ప్రక్రియ తమ జీవితాల ను దుర్భరం చేస్తున్నాయని మరోవైపు వర్తకులు ఆరోపి స్తూ, పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
పన్ను ఎగొట్టేవారి భరతం పనిపట్టడానికి ప్రభుత్వం వేచిచూస్తోందని, అన్ని చక్కబడ్డాక వారి అంతు చూస్తుందని ఢిల్లీ మార్కెట్‌లో అనుభవపూర్వకంగా చేదనుభవం చూసి న ఆ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా గత వారం రె వెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఒకవేళ అధికారులు జిఎస్‌టిఆర్ 1,2,3(రిటర్నులు) మ్యాచ్ చేయడం పూర్తి చేస్తే ఈ సమస్యలన్నింటినీ చక్కదిద్దే అవకాశం ఉందని అన్నారు. ‘ఎక్కువ క్లిష్టత ఉన్నందున మరింత సమయం కావలసి వస్తోంది. మ్యాచింగ్‌ను మేము వాయిదా వేసుకోవలసి వ చ్చింది. ఇక రెండోది దేశవ్యాప్తంగా సరకు రవాణా గుర్తించేందుకు ఇవే బిల్లులు తేగలిగితే జిఎస్‌టి విధానంలో లొసుగులు లేకుండా చేయొచ్చు. జిఎస్‌టికి ఇంకా ప్రజ లు సిద్ధం కాలేదు. అందుకే వారు దానిని వాయిదా వేస్తున్నారు. దేశంలో వస్తువులు పన్నులు కట్టకుండానే రవా ణా అవుతున్నాయి. కానీ ఇవే బిల్లు దీన్నంతటిని బట్టబయలు చేయగలదు’ అని అధియా చెప్పారు. ఇదిలా ఉం డగా ఇటీవల జిఎస్‌టి కౌన్సిల్ ఇవే బిల్లును వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి తప్పనిసరి చేయాలని నిర్ణయించిం ది. మరికొన్ని నెలల్లో ఇవే బిల్లు విధానానికి మారేందు కు అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించనున్నారు. అనేక సాధారణ వస్తువులపై కూడా 28 శాతం జిఎస్‌టి విధిస్తున్నారని, ఇది పన్ను ఎగ్గొట్టేందుకు వాతావరణాన్ని కల్పిస్తుందని కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భావిస్తున్నారు. ‘ఒకవేళ అధిక పన్ను విధిస్తే ఎవరూ పన్ను కట్టబోరు’ అని ఓ మంత్రి అన్నారు. అధిక పన్నులే సమస్య కాకుండా మ రింత అధికంగా చార్జిలు విధించడం జరుగుతోందని కొ న్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. కొన్ని దుకాణాలు గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పి)పై కూడా జిఎస్‌టిని వేస్తున్నాయి. రూ. 40 ఎంఆర్‌పి ఉండే టూత్‌పేస్ట్‌పై చిల్లర వర్తకుడు 18 శాతం చార్జి చేస్తున్నాడు. దాంతో టూత్‌పేస్ట్ ధర కాస్త రూ. 47 లేక రూ. 48 అవుతోంది. ‘వాస్తవానికి ఎంఆర్‌పి అంటేనే అంతకు మించి చె ల్లించకూడని ధర. అందులోనే అన్ని సుంకాలు మిళితం కావాలి. కానీ జరుగుతున్నది వేరే విధంగా ఉంటోంది. వినియోగదారుల అజ్ఞానం, మె తకవైఖరిని అలుసుగా తీసుకుని దోచేసుకుంటున్నారు. దీనిపై చైతన్యం తెచ్చి, అన్ని దుకాణాల వద్ద తప్పనిసరి బోర్డులు పెట్టి అరికట్టా ల్సి ఉంది’ అని డెల్లాయిట్ సంస్థ కు చెందిన కన్సల్టింగ్ పా ర్టనర్ ఎం.ఎస్.మణి చెప్పారు. ఇదిలా ఉండగా అన్నింటిపై ఎంఆర్‌పిలను పునర్ముద్రించాలని కంపెనీలను ప్రభుత్వం కోరింది. నియమాన్ని ఉల్లంఘించే కంపెనీలపై వి చారణ జరుపుతామని కూడా హెచ్చరించింది.