Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సహజ చిట్కాలతో ఏజింగ్‌కు చెక్

Aging-Tips

చర్మం మెరుస్తూ అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కొందరిలో కొన్ని కారణాల వల్ల చర్మం త్వరగా ముడతలు పడి, కళావిహీనంగా తయారవుతుంది. ఇలా కాకుండా ఉండేందుకు కొన్ని సహజ పద్ధతులు పాటిస్తూ, చిన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. చర్మ కణాలు ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూ, పాతవి పోతూంటాయి. ఎప్పుడైతే పాతవి పోతూ, కొత్త చర్మ కణాలు ఏర్పడవో అప్పుడు చర్మం ముడతలు పడడం మొదలవుతుంది. ఇలా జరగడానికి కారణాలనేకం. నివారణ మార్గాలూ ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా కొన్ని అలవాట్లలో మార్పు చేసుకోవడం అవసరం. సంబంధిత చిట్కాలు, పద్ధతులు, మార్చుకోవాల్సిన అలవాట్లను గురించి తెలుసుకుందాం…

  • సిగరెట్ తాగడం, పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల చర్మం త్వరగా ఏజింగ్‌కు గురవుతుంది. పొగాకు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడుతుంది, చర్మ ఆరోగ్యం కాపాడడంలో విటమిన్ ‘సి’ పాత్ర అమోఘం.
  • ఎండకు ఎక్కువగా తిరగడం వల్ల చర్మం రంగు మారుతుంది. బ్రౌన్ కలర్ మచ్చలు వస్తాయి, చర్మం పొడిగా మారి ముడతలు ఎక్కువవుతాయి.
  • ఒకే చోట కదలకుండా ఉండే జీవన విధానం వల్ల కండరాలు బలహీనమవుతాయి. ఈ రకమైన జీవన విధానం ఎర్ర రక్తకణాలు ఏర్పడకుండా కూడా అడ్డుకుంటుంది.
  • ఒత్తిడికి గురవడం, ఆల్కహాల్ తీసుకోవడం, నిద్ర లేమి వంటివి కూడా త్వరగా చర్మం ముడతలు పడేందుకు కారణమవుతుంది.
    ఏజింగ్‌కు కారణమయ్యే అంశాలు-
  • మెటబాలిజంలో లోపం వల్ల ఏర్పడే ఫ్రీ రాడికల్స్ దాడి చేయడం, వాతావరణ ప్రభావం వంటివి ఏజింగ్ త్వరగా అయ్యేందుకు కారణమవుతాయి. దీన్ని నివారించడానికి యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవాలి.
  • అధిక కొవ్వు, ప్రాసెస్డ్ ఫుడ్స్, పిండిపదార్థాలు అధికంగా ఉండే ఆహారంలో తక్కువ యాంటాక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ పెరుగుదలకు కారణమవుతాయి.
  • ఆస్తా, హై బిపి, హై కొలెస్టరాల్, కార్డియో వాస్కులార్ జబ్బులు, డయాబెటీస్, పార్కిన్సన్స్, క్యాన్సర్ వంటి లైఫ్ స్టైల్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు శరీరంలో యాంటాక్సిడెంట్ల స్థానంలో ఫ్రీరాడికల్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, ఇది చర్మానికి హాని చేస్తుంది.

సహజ పరిష్కారాలు కొన్ని : 

  • స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. ఎండకు బయటకు వెళ్లకపోవడం మంచిది, వెళ్లాల్సి వస్తే చర్మాన్ని సాధ్యమైనంత కవర్ చేయాలి. యోగా, మెడిటేషన్ సాధన చేస్తూ ఆహారంలో కూడా పోషకాలు తీసుకోవాలి. అతిగా తినడం, ఉపవాసాలు అతిగా చేయడం రెండూ మానేయాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి, వీటిల్లో దొరికే విటమిన్లు, మినరళ్లు చర్మానికి మేలు చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు విటమిన్, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మంలో తేమ శాతం తగ్గకుండా ఉంటుంది. ఇవే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సూపర్ ఫుడ్స్ కొన్నింటిని ప్రయత్నించొచ్చు.
  • ఆహారంలో మొదటగా తగ్గించాల్సినవి ‘త్రీ వైట్స్’ అవి- ఉప్పు, చెక్కర, మైదా.
  • అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది, దీన్లో ఉండే విటమిన్ ‘ఇ’ త్వరగా వచ్చేఏజింగ్‌ను అడ్డుకుంటుంది.
  • బ్లాక్, బ్లూ బెర్రీస్, గ్రేప్స్ సూపర్ ఫుడ్స్ కిందకు వస్తాయి, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం.
  • వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. దీన్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
  • క్యాబేజీ, బ్రకోలీ, టర్నిప్, మొలకలు లాంటివి శరీరంలో ఏర్పడే టాక్సిన్లతో పోరాడి ఏజింగ్ లక్షణాలను దరిచేరనివ్వవు.
  • వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను నివారిస్తే, అల్లం జీర్ణక్రియలో తోడ్పడుతుంది. ఆర్థ్రైటీస్ నివారణలో, ఫ్రీ రాడికల్స్ తగ్గించడంలో కూడా అల్లం తోడ్పడుతుంది.
  • నట్స్ రోగనిరోధక శక్తిని పెంచి చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి.
  • పుచ్ఛకాయలో ఉండే విటమిన్ ‘ఎ, బి, సి’ లు ఫ్రీ రాడికల్స్‌తో పొరాడి చర్మం మెరిసేందుకు ఉపయోగపడతాయి.
  • ముల్లంగి, టర్నిప్‌లు యాంటీ ఏజింగ్ లక్షణాలను నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి.
    యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్
  • చర్మం ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ ఇ తోడ్పడుతుంది. సన్‌ఫ్లవర్ నూనె, గింజలు, ఓట్స్, నట్స్, పాల పదార్థాలలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.
  • ఆహారంలో తగినంత క్యాల్షియం తీసుకోవడం అవసరం.
  • విటమిన్ డి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తూ ఆస్టియోఫోరోసిస్‌ను నివారిస్తుంది.
  • ఎండవల్ల వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని విటమిన్ ఎ నివారిస్తుంది. ఇది క్యారెట్, బ్రకోలి, టమాటో వంటి వాటిల్లో లభిస్తుంది.

Comments

comments