Home తాజా వార్తలు చంచల్‌గూడ జైలుకు గజల్ శ్రీనివాస్

చంచల్‌గూడ జైలుకు గజల్ శ్రీనివాస్

GAJAL-2

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు గజల్ శ్రీనివాస్‌కు ఈనెల 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేస్తామని పంజాగుట్ట ఎసిపి విజయ్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా తాను ఎలాంటి తప్పు చేయలేదని గజల్ శ్రీనివాస్ తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన కుమారి తనకు బిడ్డలాంటిదని ఆయన చెప్పారు.

Ghazal Srinivas to Chanchalguda jail