Home రాష్ట్ర వార్తలు మరి రెండు మేని ఫెస్టోలు

మరి రెండు మేని ఫెస్టోలు

Untitled-1.jpg8552ఎన్నో చేశాం, మరెన్నో చేస్తాం, ప్రతి ఒక్కరికీ ఉచిత మంచినీరు, పైపు ద్వారా కుకింగ్ గ్యాస్ : కాంగ్రెస్

77 వాగ్దానాలు, హైదరాబాద్ అభివృద్ధికి 23 కేంద్ర కార్యక్రమాలు, పూర్తిస్థాయి వైఫై నగరం : టిడిపి – బిజెపి
మన తెలంగాణ / హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ, టిడిపి – బిజెపి కూటమి ఆదివారం నాడు విడివిడి గా ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ ఉచిత మంచినీరు, ప్రతి డివిజన్‌లో ఉచిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వగైరా వాగ్దానాలు చేసింది. టిడిపి – బిజెపి కూటమి 77 హామీలతో మేని ఫెస్టో విడుదల చేసింది.

మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ది పనులను చేసిందని, మరెంతో అభివృద్ధి చేయనుందని టిపిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గాంధిభవన్‌లో ఆదివారం జిహెచ్‌ఎంసి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉత్తంకుమార్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హాయాంలో 2004-2014 వరకు ఒక స్వర్ణ దశాబ్దంగా అభివర్ణించారు. రాజీవ్‌గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం, నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, గోదావరి, కృష్ణ జలాల తరలింపు, పంజగుట్ట, హైటెక్ సిటీ, సీతాఫల్‌మండి, చాంద్రాయణగుట్ట, టోలిచౌకి ఫ్లైఓవర్లు, లకిడీకాపూల్ రోడ్ ఓవర్ బ్రిడ్డ్ తదితర అభివృద్ధి పనులన్ని కాంగ్రెస్ పార్టీ హయంలోనే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. వీటిలో అనేక అభివృద్ధి పనులు కాంగ్రెస్ పాలనలోనే పూర్తి కాగా, మరికొన్ని ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును తెచ్చామని, టిఆర్‌ఎస్ పార్టీ తుగ్లక్ మాదిరిగా వ్యవహరించిన కారణంగా నగర ప్రజలకు సకాలంలో అందుబాటులోకి రాలేదని ఆయన విమర్శించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.5,025 కోట్లుగా ఉన్న ఐటి ఎగుమతులు కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.57,000 కోట్లకు, ఉద్యోగాలు 85,945 నుండి 3,23,691కు పెరిగాయని తెలిపారు. 2004-05లో ఎంసిహెచ్ బడ్జెట్ రూ.680 కోట్లుండగా, 2014-15 నాటికి జిహెచ్‌ఎంసిగా విస్తరించి రూ.4,599 కోట్లయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, నగరంలో స్థిరపడ్డ సీమాంధ్రులను గో బ్యాక్ అంటూ టిఆర్‌ఎస్ పార్టీ బెదిరిస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌కున్న బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు చక్రాల రఘు రచించి, గానం చేసిన గ్రేటర్ హైదరాబాద్ గెలుపు పాటల సిడిని ఉత్తమ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మేనిఫెస్టో రూపకల్పన కమిటీ ఛైర్మన్ నాగయ్య, ఎం.ఎల్.సి ఆకుల లలిత, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేశం, ఎన్‌ఆర్‌ఐ సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, నాయకులు మర్రి ఆదిత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు
* ప్రతి ఒక్కరికి ఉచిత తాగునీటిని, -పైపు ద్వారా కుకింగ్ గ్యాస్‌తో పాటు వ్యర్థ పదార్థాల నిర్వహణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు
* హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ట్రాఫిక్‌ను నియంత్రణ
*పవర్ కేబుల్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా ఏర్పాటు
*సోలార్‌కు ప్రాధాన్యం
*ప్రతి డివిజన్‌లో ఉచిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
*ప్రతి డివిజన్‌లో ఉచిత పాఠశాల ఏర్పాటు
* విదేశాల్లో ఉన్నత విద్యకై వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఒక సెల్
* విపత్తు నిర్వహణకై సెల్,
* పార్కులు, మైదనాలు, చెరువులను కాపాడేందుకు చర్యలు
*వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ
*150 డివిజన్లలో మహిళా భవన్‌ల నిర్మాణం
*భిక్షగాళ్లకు పునరావాసం

మన తెలంగాణ/హైదరాబాద్ ః శుభ్రత, భద్రత, అభవృధ్దే ధ్యేయాలుగా బిజెపి టిడిపి కూటమి ఆదివారం ‘విజన్ డాక్యుమెంట్ ఫర్ హ్యాపీ హైదరాబాద్’ పేరిట జిహెచ్‌ఎ ంసి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ ప్రణాళికలో 77 వాగ్దానాలు పొందుపర చగా,కేంద్ర ప్రభు త్వం ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాభివృధ్ది కోసం తీసుకున్న 23 చర్యలు వాటికి వెచ్చించనున్న నిధుల గురించి వివరించారు. దీనితోపాటు ప్రతి ఇంటికీ మంచి నీటి సరఫరా చేయడంలో భాగంగా పేదలందరికీ ఉచితంగా నల్లా కనక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. నగరం లోని అన్ని ముఖ్యమైన కూడళ్ళలో,ప్రభుత్వ ఆసుప త్రుల్లో ఉచిత పార్కింగ్ సదుపా యం కల్పిస్తా మని తెలపడం ద్వారా సా మాన్యు లు ఇన్నేళ్ళు పార్కింగ్ కోసం ఎం తెంత రుసుము చెల్లిం చాల్సి వచ్చిందో చెప్ప నే చెప్పినట్ల యింది. కాగా ప్రతి డివిజన్‌లో మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం తోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని మరో వాగ్దానంలో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత అవసరానికి తగిన విధంగా ప్రతి ఇంటికి సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తామని తెలిపారు .భవన నిర్మాణ, పారిశుధ్య,ఆటో కార్మికుల కోసం ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కా గా వ్యక్తిగత మైన హామీలు ప్రజలకు ఏమీ ఇవ్వకుండా సామూహిక సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకుని వాగ్దానా లు చేసినట్లు తెలు స్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగర ప్రజ లు డబుల్ బెడ్ రూం ఇళ్ళపై ఆశలు పెంచు కుని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క హైద రాబాద్ నగరంలోనే 7 లక్షల ఇళ్ళు నిర్మిస్తా మని చెపుతున్నా ఒక్కో ఇంటికి అయ్యే వ్య యం రూ 7 లక్షల్లో రూ 2.50 కేంద్ర ప్రభు త్వం భరిస్తున్నా దీనికి సంబంధించిన ప్రచారం అంతా టిఆర్‌ఎస్ గాలికి ఎగరేసు కు పోతున్నదంటున్నారు. మొత్తం మీద అన్ని పార్టీల ప్రణాళికలు పాత సీసాలో కొత్త సారా నింపిన చందంగా ఉన్నాయని పేదలు పెదవి విరుస్తున్నారు.
దీనికి తగిన విధంగా వ్యక్తిగత హామీలు ఇవ్వడం ద్వారా (డబుల్ బెడ్ రూం వంటివి) లభ్ది అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.