Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్…

GHMC

హైదరాబాద్: నగర జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో గురువారం కొత్త సభ్యులతో స్టాండింగ్ కమిటీ సమావేశా న్నినిర్వహించారు. జిహెచ్‌ఎంసి పునర్వవస్థీకరణ, మలక్‌పేట అర్‌యుబి విస్తరణ, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు తీర్మానాలను ఈ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలో 50 సర్కిళ్లు, 10జోన్లకు సంబంధించి సిబ్బంది, అధికారుల నియామకం, విధివిధానాలు, 1200 అదనపు పోస్టులు, ఏడాదికి అయ్యే అదనపు వ్యయం ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. పంజాగుట్టలో రూ.5.95 కోట్ల ఖర్చుతో స్టీల్ బ్రిడ్జిని చేపట్టడానికి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల పునర్‌నిర్మాణం, అభివృద్ధి, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి, లేక్స్ విభాగానికి పచ్చజెండా ఉపింది. ప్రత్యేక స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించే తీర్మానానికి ఆమోదం ఇచ్చింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ దగ్గర అదనపు మార్గం ఏర్పాటు చేసేందుకు అడ్డుగా ఉన్న 7 ఆస్తుల బిల్డింగ్ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం కమిటీ అమోదం తెలిపింది.

Comments

comments