Search
Friday 16 November 2018
  • :
  • :

జిహెచ్‌ఎంసిలో సర్కిళ్లు, జోన్లు పెంపు

GHMC has decided to build a steel bridge in Panjagutta

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని సర్కిళ్లను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇదివరకు ఉన్న 30 సర్కిళ్లను కాస్త 48 సర్కిళ్లకు, ఆరు జోన్ల నుంచి 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ప్రతి 2 అసెంబ్లీ స్థానాలకు ఒక జోన్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి జోన్ పరిధిలో 4 సర్కిళ్లు ఉండే విధంగా మార్చారు. సర్కిళ్లు, జోన్ల పెంపుతో 1,610 అదనపు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భాగ్యనగరంలో సమర్థవంతంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నమని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. దీనికి సంబంధించిన జివొ నెం.149ను ప్రభుత్వం పురపాలక పరిపాలన నగరాభివృద్ధి శాఖ శనివారం విడుదల చేసింది.

Comments

comments