హైదరాబాద్ : నగరంలోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని పలు ప్రముఖ హోటళ్లపై జిహెచ్ఎంసి అధికారులు దాడులు నిర్వహించారు. హోటళ్లలో చెడిపోయిన ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన శివాని హోటల్‌కు రూ.10 వేలు, శిల్పి, గ్రీన్ బావార్చి రెస్టారెంట్లకు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. మరోసారి ఈ విధంగా నిర్లక్షం వహిస్తే హోటళ్లు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.