Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

భారీగా కూల్చివేతలు

footpath

footpath

ఫుట్‌పాత్ ఆక్రమణలపై జిహెచ్‌ఎంసి ఉక్కుపాదం
తొలిరోజు 1024 షాపుల తొలగింపు
అడ్డుకున్న యజమానులు, సిబ్బంది
స్పెషల్ డ్రైవ్‌కు మంచి స్పందన – ఇడి విశ్వజిత్

మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో: ఫుట్‌పాత్ ఆక్రమణలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం తొలగించారు. పలుచోట్ల దుకాణాల యాజమానులు, వారి సిబ్బంది కూల్చివేత పనులకు అడ్డం తగిలారు. అయితే జిహెచ్‌ఎంసి అధికారులు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఎలాంటి కట్టడాలనైనా వరుస క్రమంలో తొలగించుకుంటూ ముందు కు వెళ్లారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుం ది. జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి నేతృత్వంలో 120 మంది సభ్యులతో కూడిన 6 ప్రత్యేక బృం దాలు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతను శనివారం చేపట్టా యి. పక్కా ప్రణాళిక, పూర్తిస్థాయి బందోబస్తుతో కూల్చివేతలకు దిగిన జిహెచ్‌ఎంసి బృందం అదే స్థాయిలో ప్రత్యేక యంత్రాలను ఉపయోగించారు. మొదటి రో జు నగర వ్యాప్తంగా 1024 ఆక్రమణలను జిహెచ్‌ఎంసి సిబ్బంది తొలగించా రు. శిథిలాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో అక్క డ నుంచి తర లించారు. మోతీనగర్‌లో అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టగానే వా టి యజమనాలు అడ్డుప డడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో ఆందోళకారులు చెల్లచెదురైయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో చోట్ల ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఈకూల్చివేతలో జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ , టౌన్ ప్లానింగ్ , యుసిడి, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బందితో పాటు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్‌కు సానుకూల స్పందన : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్
ఫుట్‌పాత్‌లపై వెలసిన అక్రమ నిర్మాణాల తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు సిటీ జనుల నుంచి సానుకూల స్పందన లభించిందని జిహెచ్‌ఎంసి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఆరు ప్రత్యేక బృందాల ద్వారా చేపట్టిన ఆక్రమణల తొలగింపు స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగిందని వెల్లడించారు. శనివారం కేవలం ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేయడం జరిగిందని, చిరు వ్యాపారులకు ఏలాంటి ఇబ్బందులు కలిగించలేదన్నారు.

Comments

comments