Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఎవరికి వారే..! చట్టం పట్టని జిహెచ్‌ఎంసి, సంగారెడ్డి, భువనగిరిలు

hmda

మన తెలంగాణ/సిటిబ్యూరో : ఏళ్ళుగడుస్తున్నా యి… ఆచరణలేదు… వ్యవహారం మారదు… ఇదీ జిహెచ్‌ఎంసి, సంగారెడ్డి, భువనగిరి పురపాలక సం ఘాల తీరు. ఫలితంగా ఆర్థిక వనరులకు దూరమవుతోన్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఎ) నగరంలో ప్రధాన ప్రజా సేవల విభాగ ం, శివారులో ముఖ్యమైన పురపాలక సంఘాలు అయిన ఈ ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వం రూపొందించిన చట్టానికిలోబడి పనిచేయడంలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ప్రజలపై అమలుపరుస్తూ ఆదాయాన్ని చేకూర్చుకుంటు న్న ఆ విభాగాలు, ప్రజల నుండి అభివృద్ధి రు సుంలను వసూలు చేసుకుంటున్నాయి. కానీ, అథారిటీకి చెల్లించాల్సిన వాటాను చేర్చడంలేదు. జిహెచ్‌ఎంసి, సంగారెడ్డి, భువనగిరి పురపాలక సంఘాల నుండి ఏటా కనీస ం రూ. 70 కోట్లు అథారిటీకి రావాల్సిందిగా చట్టం పేర్కొంటుంది.

చట్టం ఇలా

హెచ్‌ఎండిఎ ఆవిర్భావం సందర్భంగా సంస్థకు ఆ దాయ మార్గాలను అప్పటి ప్రభుత్వం చట్టంలో స్ప ష్టంగా వెల్లడించింది. అథారిటీ చట్టం -2008లో చాప్టర్-7లోని 41వ సెక్షన్ సంస్థకు ఆదాయాన్నిచ్చే ఆదేశాన్ని స్పష్టం చేసింది. సంస్థ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, పురపాలక సంఘాలు ప్రతిఏ టా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి గత సంవత్సరంలో వచ్చిన రాబడి (అభివృద్ధి రుసుంలు)లో 10 శాతం వాటాను అథారిటీ అభివృద్ధి నిధికి చెల్లించా లి. అని పేర్కొన్నది. ఈ కేటాయింపులు సంస్థకు ఆ ర్థిక సహాకారం గా ఉంటుందని సూచించింది.

అమలుకు తిలోదకాలు

అథారిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన చట్టంను జిహెచ్‌ఎంసి, రెండు మున్సిపాలిటీలు ఆచరించడంలేదు. అదే ప్రభుత్వం అందించిన చ ట్టాన్ని కార్పొరేషన్, పురపాకల సంఘాలు అమలు చేస్తూ అభివృద్ధి రుసుంలను పోగుచేసుకుంటున్నా యి. ఒకటికాదు రెండుకాదు ఏకంగా ఎనిమిదేళ్ళు గా ఆ చట్టానికి మొండిచేయి చూపుతున్నాయి. వం దల కోట్లు బకాయిపడుతూ వస్తున్నాయి. తమకు వచ్చే ఆదాయంలో కోతపడుతుందని చట్టాన్ని పక్కనపెట్టాయి. వీటి పరిధిలో భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తూ అభివృద్ధి రుసుంలను వసూలు చేస్తున్నాయి. జిహెచ్‌ఎంసికి అభివృద్ధి రుసుంల పేరిట ఏటా రూ.1000 కోట్లుపైబడి వస్తున్నట్టు అంచనా ఉన్నది. సంగారెడ్డి, భు వనగిరిలకు కలిపి రూ.100 కోట్లు వరకు వస్తాయనేది అధికారుల భావన. ఈ ఆదాయంలో 10 శాత ం అంటే కనీసంగా రూ. 110 కోట్లు హెచ్‌ఎండిఎ అభివృద్ధి నిధికి చేరాలని చట్టం పేర్కొన్నది. కానీ, ఏ ఒక్క సంవత్సరం కూడా ఈ నిధులు అథారిటీకి చేరలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఎనిమిదేళ్ళ నుండి ఒక్క జిహెచ్‌ఎంసి నుండి రూ. 800 కోట్లు వాటాగా రావాల్సి ఉన్నది.

జిహెచ్‌ఎంసి నిర్వాకంతో పన్నునొప్పి

గతంలో అథారిటీకి రూ.1400 కోట్లు చెల్లించినట్టు జిహెచ్‌ఎంసి తన వార్షిక బడ్జెట్‌లో చూపించిగా అది గమనించిన ఆదాయాపు పన్ను శాఖ హెచ్‌ఎండిఎకు నోటీసులు పం పింది. రూ. 66 కోట్లు ఐటిగా చెల్లించాలని సూచించింది. జిహెచ్‌ఎంసి చెల్లించాల్సిన వాటా చెల్లించకపోగా చెల్లించినట్టు చూపి అథారిటీకి ఐటి నోటీసులు వచ్చేలాచేసింది. ఆ నిధులను కేటాయిస్తే బాలానగర్ ఫ్లైఓవరతోపాటు ఔటర్ రింగ్‌రోడ్ గ్రోత్ కారిడార్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అథారిటీ అధికారుల అభిప్రాయం.

Comments

comments