Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌కు అభయం

GHMC sub-liquid reactor launched by the Army (DRF)

జిహెచ్‌ఎంసి ఉప ద్రవ ప్రతి స్పందన సైన్యాన్ని (డిఆర్‌ఎఫ్) ప్రారంభించిన కెటిఆర్
అనుకోని విపత్తులలో కీలకపాత్ర, దేశంలోనే మొదటిసారి 

మన తెలంగాణ/ హైదరాబాద్ : అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగర పరిరక్షణ కు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు అన్నారు. విపత్తు లు, ప్రమాదాలు జరిగినప్పుడు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టేందుకే డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన మొదటి కార్పొరేషన్‌గా జిహెచ్‌ఎంసి నిలుస్తోందని కెటిఆర్ చెప్పారు. శనివా రం ఐమ్యాక్స్ సమీపంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్)ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, స్థానిక ఎంఎల్‌ఎలు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయరెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, మెట్రోరైల్ ఎం.డి.ఎన్‌విఎస్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ అనుకొని ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు మున్సిపల్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అన్ని శాఖల సమన్యయంతో జిహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా తక్షణం చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ ద్వారానే ఆదాయం వస్తుందన్నారు. హైదరాబాద్‌ను సురక్షితమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని కెటిఆర్ అన్నారు.

డిఆర్‌ఎఫ్ ఏర్పాటు చేయాలని అప్పుడే నిర్ణయించా : నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి సంఘటన తనను కలచివేసిందని కెటిఆర్ అన్నారు. ఆ సంఘటనలో 11 మంది కూలీలు చనిపోయారని, శాస్త్రీయ పద్ధ్దతిలో విపత్తుల సంభవించినప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. జిహెచ్‌ఎంసిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో డిఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డైరక్టర్ పదవి సృష్టించి, దానికి ఐపిఎస్ అధికారి విశ్వజిత్‌ను నియమించామన్నారు. 120 మంది లో డిఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుతామని, ప్రతిజోన్‌కు డిఆర్‌ఎఫ్ సిబ్బందిని కేటాయిస్తామన్నారు. భవనాలు కూలిపోయినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలకు ఆత్మస్తైర్యం, విశ్వాసం కల్పిస్తుందన్నారు. డిఆర్‌ఎఫ్ సిబ్బందికి రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల సమన్యయం తో డిఆర్‌ఎఫ్ పనిచేస్తుందని అన్నారు.

Comments

comments