Home తాజా వార్తలు పోలీసు వాహనం ఢీకొని కార్మికురాలు మృతి

పోలీసు వాహనం ఢీకొని కార్మికురాలు మృతి

GHMC Worker Died in Road Accident

హైదరాబాద్: భాగ్యనగరంలో రెయిన్‌బజార్ యాఖత్‌పురా ప్రాంతం బ్రాహ్మన్వాడీలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ రక్షక్ వాహనం (TS09PA2211)  రోడ్లు ఊడుస్తున్న జిహెచ్ఎంసి కార్మికురాలిని ఢీకొట్టింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.