Home అంతర్జాతీయ వార్తలు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. నలుగురు కార్మికులు మృతి

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. నలుగురు కార్మికులు మృతి

GHMC workers killed

 

తమిళనాడు: తిరువూరులోని ఓ ఫ్యాక్టరీలో సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి నలుగురు పారిశుద్ద్య కార్మికులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒకే గ్రామానికి చెందిన నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ఓ ఫ్యాక్టరీలోని సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేయడానికి ట్యాంక్‌లోకి దిగేముందు వీరు ఎటువంటి మాస్కులు ధరించలేదని ముందుగా ఇద్దరు దిగగా.. వారి నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో మిగతా ఇద్దరు కూడా లోపలికి దిగారు. దీంతో విష వాయువులు వెలువడంతో ఉక్కిరిబిక్కిరై ఆ నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని ఘటన సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన నలుగురు యువకులు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వారిని సెప్టిక్ ట్యాంకులోకి దించిన ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియల్సి ఉందని పోలీసులు తెలిపారు.

GHMC workers killed in Tamil nadu