Home తాజా వార్తలు కాంగ్రెస్ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు…

కాంగ్రెస్ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు…

teratrist-image

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ నేత గులాం నబీ పటేల్ ను బుధవారం ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలోని చౌక్ వద్ద జరిగింది. ఆయన కారులో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందగా, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పటేల్ మృతి పట్ల జమ్ముకాశ్మీర్ సిఎం మహబూబా ముఫ్తీ సానుభూతి ప్రకటించారు.