Home స్కోర్ ‘దిగ్గజం’ సచిన్‌తో విరాట్‌ను పోల్చడం సరికాదు: కపిల్

‘దిగ్గజం’ సచిన్‌తో విరాట్‌ను పోల్చడం సరికాదు: కపిల్

Kapil-Devకోల్‌కతా: సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం సరైంది కాదని భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ శనివారం అన్నారు. అసలు పోల్చాసిన అవసరం ఏముందని, సచిన్ తన స్థాయిలో దిగ్గజం అని, విరాట్ ఇంకా ఆట ఆరంభ దశలోనే ఉన్నాడని అన్నారు. కనుక ఆ ఇద్దరిని పోలడం సరైంది కాదని తన అభిప్రాయమన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన తదుపరి కెప్టెన్ ఎవరన్నది ఐదుగురు సెలక్టర్లకే వదిలేయాలన్నారు. ప్రపంచ టి20 ఫైనల్స్‌లో భారత్ అపజయం పొందినందుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ పదవిని వదిలేయాలా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ధోని అనేక సందర్భాలలో భారత్ గర్వించేలా చేశారన్నారు. మార్పు అనేది అవసరమని సెలెక్టర్లు తలచినప్పుడు వారు మార్పులు చేస్తారని, కనుక ఆ విషయాన్ని వారికే వదిలేయాలన్నారు. ప్రపంచ టి20 కప్‌లో భారత్ ఓడిపోడానికి కారణం దాని ప్రత్యర్థులు బాగా ఆడడమేనన్నారు. ఒకవేళ వేరే జట్టు బాగా ఆడినప్పుడు దానిని గౌరవించాలన్నారు. పొట్టి గేమ్(షార్ట్ వర్షన్) క్రికెట్‌ను చెడగొడుతున్నదా అని విలేకరులు అడిగినప్పుడు ఎందుకిలాంటి ప్రశ్నలడుగుతారన్నారు. ఎన్ని సిక్సర్లు, ఎన్ని చేజింగ్ మూమెంట్లు చూశామందులో… క్రికెట్ ఉన్నంత వరకు ఈ షార్ట్ వర్షన్ ఉండనుందని, తాను కూడా దానిని సమర్థిస్తానని కపిల్ అన్నారు.