Home జాతీయ వార్తలు తెలంగాణకు వరం ఉద్యాన వర్సిటీ

తెలంగాణకు వరం ఉద్యాన వర్సిటీ

రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రులు
కేంద్ర మంత్రులు, సిఎంకు వేదపండితులు ఘన స్వాగతం
భారీగా హాజరైన రైతులు, మహిళలు =పోలీసులు భారీ బందోబస్తు
112.5ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన  కేంద్ర మంత్రులు
KCR2`మనతెలంగాణ/గజ్వేల్,ములుగు: దేశంలో తెలంగాణ రాష్ట్రాని కే మణిహారంగా మారనున్న ఉద్యానవన విశ్వవిద్యాలయంతో పాటు మరోరెండు సంస్థలకు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, సిఎం కెసిఆర్‌లు గురువారం ములుగులో శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ విశ్వవిద్యాలయం లేని కొరత ఎట్టకేలకు తీరింది. విడిపోవటంతో ఎపికి వీటి నిర్మాణాలకు సుమారు రూ.1831కోట్లు మంజూరు చేశారు. 112.5ఎకరాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఐదేళ్లలో పూర్తికానున్న ఈ నిర్మా ణాలతో తెలంగాణ రాష్ట్రం ఉద్యాన పంటలతో అలరారుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలతో ఎప్పటికప్పుడు వ్యవపాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే అవకాశం ఉంది. కొత్త వంగడాలను ప్రవేశపెట్టి అధిక ఫలసాయం పొందేలా రైతుకు ఆర్థ్ధిక పరిపుష్టి కల్పించే అవకాశాలున్నాయి.
జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక నియోజకవర్గం, నల్లగొండ జిల్లా ఆలేరు, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ రైతులకు ఎంతో మేలుజరుగనుంది. ప్రత్యేకంగా ఫలపరిశోధనా కేంద్రంలో ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే పరిశోధనల ఫలితాలు తెలంగాణ రైతులు పండించే ఉద్యాన పంటల ఉత్పత్తులకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత రానుంది. ఉత్పత్తులు ఎగుమతులకు కూడా ఎన్నో అవకాశాలున్నాయి. ఈ పరిశోధనా కేంద్రానికి తెలంగాణ జిల్లాలలో ఉన్న మరో పదకొండు పరిశోధనా సంస్థ్థలు అనుబంధంగా ఉండనున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులకు గురువారం ములుగు సభలో సిఎం కెసిఆర్ ప్రకటించిన కోల్డ్ స్టోరోజీ ప్లాంటుఏర్పాటుకు ఇరవై కోట్లను మంజూరు చేయటం మరోవరంగా భావించాలి.
ములుగులో అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం
భారీగా హాజరైన రైతులు, మహిళలు …
ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయ శంఖుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారుదత్తాత్రేయ, సిఎం కెసిఆర్‌లకు వేదపండితులు పూర్ణకుం భంతో ఘనంగా స్వాగతం పలికారు. సభాస్థలికి సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ ఉద్యాన పంటల ఉత్పత్తులు, డ్రిప్‌ఇరిగేషన్ యంత్రాలు, ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాలతో కూడిన ప్రదర్శన శాలలను కేంద్రమంత్రులు ప్రారంభించారు. వాటిని పరిశీలిస్తూ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మొదట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మూడు నిమిషాలు మాట్లాడారు. ఆతర్వాత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పది నిమిషాలు మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ 45 నిమిషాల సేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. సభలో చివరగా సిఎం కెసిఆర్ కేవలం పదినిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన రైతులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలు రావటానికి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖులు రావటంతో సభాస్థలితో పాటు ఆప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హాజరైన జనానికి, అధికారులకు, పోలీసులకు మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు వాలంటీర్లు సభాప్రాంగణంలో తిరుగుతూ కనిపించారు.
సభాప్రాంగణంలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్యశాలను ఏర్పాటు చేశారు. కాగా సభ ముగిసిన కొద్దిసేపటికే సభలో ఉన్న హార్టీకల్చర్ డిప్లమా చేసిన విద్యార్థులు కొందరు తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేయటం, కుర్చీల నుంచి వారులేచి కేకలు వేయటంతో అందరిదృష్టిని ఆకర్శించారు. వెంటనే పోలీసులు వారిని సముదాయించటంతో సమస్య సద్దుమణిగింది. ఈకార్యక్ర మంలో డిసిసిబి ఛైర్మన్ చిట్టిదేవేందర్ రెడ్డి,గజ్వేల్ నగరపంచాయతి ఛైర్మన్ భాస్కర్,టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి భూమిరెడ్డి,ములుగు ఎంపిపి వెంకట్రాంరెడ్డి,మండల జడ్పీటిసీ సింగం సత్తయ్య,మండల పార్టీఅధ్యక్షుడు జహంగీర్,కొండపాక జడ్పీటీసి చిట్టి మాదవి,రాష్ట్రనాయకులు ఎలక్షన్‌రెడ్డి, ములుగు ఎంపిటిసీలు కిష్టయ్య, మమతా శ్రీనివాస్,యువత విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుగుణాకర్‌రెడ్డి, సర్పంచులు మక్తాల వెంకటేశ్, కైలాసం,అనురాధాభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.