Home ఎడిటోరియల్ మధ్యప్రదేశ్ పేదలకు వరాల జల్లు

మధ్యప్రదేశ్ పేదలకు వరాల జల్లు

SHIVARAJ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 11 ఏళ్ల పదవీకాలం పూర్తిచేశారు. రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా బిజెపి ముఖ్య మంత్రుల విషయంలో ఇది అద్భుతం. కాంగ్రెస్ నాయ‚కుడు దిగ్విజయ్‌సింగ్ మాత్రమే రెండు ఐదేళ్ల పదవీ కాలాలు పూర్తిచేశాడు.

1956లో మధ్యప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 16మంది ముఖ్య మంత్రులు పరిపాలించారు. అందు లో మరో ఇద్దరు మాత్రమే= డాక్టర్ కె.ఎన్. కట్జు, అర్జున్ సింగ్-ఒక ఐదేళ్ల పూర్తి పదవీకాలం అధికారంలో ఉన్నారు. 16మంది ముఖ్యమంత్రుల్లో ఆర్గురు జనసంఘ్, బిజెపి లకు చెందినవారు. వారు కైలాస్ జోషీ, వి.కె.సక్లేచా, ఎస్.ఎల్. పట్వా, ఉమా భారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే చౌహాన్ 11 ఏళ్లు అధికారం కాపాడుకోవటంలో మిష్టరీ ఏమిటి? ఆయన అద్భుతంగా సమ తులన విన్యాసం నిర్వర్తించారు.

అతను ‘గోవర్దన్ పరిక్రమ’కు వెళతాడు, ఈద్గాకు వెళ్లి స్కల్ క్యాప్ పెట్టుకుని నమాజీలను ఆలింగనం చేసు కుంటాడు. తీర్ధదర్శన్ రైలు మిమ్ము లను బద్రీనాథ్, వైష్ణోదేవి, హరిద్వార్, రామే శ్వరం తీసుకెళుతుంది. అది మిమ్ము అజ్మీర్, అమృతసర్, సమ్మద్ శిఖర్, శ్రావణ బెళగోళ, వైలాకన్ని చర్చికి తీసు కెళుతుంది. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ ఎజండా అమలు జరుపుతున్నాడనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సారం లో కాక పోయినా రీతిలో అయినా అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా కనబడ తాడు.

ఆర్‌ఎస్‌ఎస్ చల్లని చూపుకింద ఉండ టానికి ఆయన ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకు హాజరు కావటానికి రాష్ట్రప్రభుత్వో ద్యోగులను అనుమతించాడు. సంఘ్ భావ జాలాన్ని ముందుకు గొనిపోవటానికి అనేక కార్యక్రమాలు నిర్వ హిస్తుంటాడు. బుద్ధిష్ట్ విశ్వ విద్యాలయం, హిందీ సమ్మేళనం, అతల్ బిహారీ వాజ్ పేయి హిందీ విశ్వవిద్యా లయం, వైచారిక్ మహాకుంభ్, ఇటీవల జరిపిన లోక్‌మంతన్ అందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
2005 నవంబర్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీక రించినపుడు మంత్రిపదవులకు ఆయన కొత్త. భోపాల్ పొరుగునున్న విధీష పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ ఒక్క రోజుకూడా మంత్రిగా లేరు. 11 ఏళ్ల తర్వాత వెనక్కు చూస్తే, ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆనాడు ఎవ్వరూ ఊహించలేదు. అందువల్లనే ఊహల కన్నా వాస్తవం చిత్రంగా ఉంటుందంటారు.
వ్యక్తిత్వం రీత్యా చూస్తే చౌహాన్ శౌమ్యశీలి, మృదు స్వభావి. అధికారంలోకి వచ్చిన చాలామంది వినయశీలుర వలె అహంకారం పెంచుకోలేదు. ప్రజలతో సంబంధాల నిమిత్తం సమాజంలోని నిర్దిష్టమైన గ్రూపులతో (ఎన్‌జి ఓలు, హమాలీలు, ఇళ్లలో పనిచేసే మహిళా సేవికలు, క్షురకర్మ కారులు వగైరా) ‘పంచాయతీలు’ జరుపు తుంటాడు. ప్రతి పంచాయతీకి 1000-1200 మంది ప్రతినిధులను ఆహ్వాని స్తాడు.

వారు చెప్పేది వింటాడు, కొన్ని తాయిలాలు ప్రకటి స్తాడు, మంచిగా భోజనం పెట్టి పంపిస్తాడు. గత ముఖ్య మంత్రులు కూడా దర్బార్‌లు నిర్వహించినా అవి ‘పాలకుడు-పాలితుడు’ సంబంధం తప్ప ‘ఆతిధేయుడు-అతిథి’ సంబంధంగా ఉండేవి కావు. అతనికి అపూర్వమైన సుస్థిరత ఉండటానికి ఆర్‌ఎస్‌ఎస్ దన్ను ముఖ్యకారణం.
శివరాజ్‌సింగ్ చౌహాన్ 11 ఏళ్ల పదవీకాలం పండుగ ను డిసెంబర్ 5న భోపాల్‌లో ఘనంగా నిర్వహించారు. 5లక్షల మందిని సమీకరించటానికి 10వేలకుపైగా బస్సులు ఉపయో గించారు. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు జన సమీకరణ కోటాలిచ్చారు. ‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమా లపై శిక్షణా కార్యక్రమం’ పేరుతో ప్రభుత్వం ఈ ప్రదర్శన నిర్వహించినా, ముఖ్య మంత్రి ప్రతిష్టను ఇనుమడింప చేయటమే దానివెనుక దాగి వున్న ధ్యేయం. 2018లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్య మంత్రి పేదలకు అనేక సంక్షేమ పథ కాలు ప్రకటించారు. ‘ఓటర్లను బుజ్జగించటానికి ఇతర రాజకీయ నాయకుల్లా తాయిలాలు ప్రకటించ టానికి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఎన్నికలు సమీ పించే దాకా ఆగలేదు’ అని ఒక స్థానిక వార్తాపత్రిక వ్యాఖ్యానించింది.
సంక్షేమ పథకాలు
ఈ సందర్భంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పేదలకొరకు ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు ఇలా ఉన్నాయిః కార్మి కులకు సరైన గృహవసతి నిమిత్తం ప్రభుత్వం ప్రైవేటురంగంతో చేతులు కలుపుతుంది. ‘వారు మురికివాడల్లో ఈగల్లా, దోమల్లా జీవిం చటాన్ని మేము అనుమతించబోము’ అని ప్రకటిం చారు.
– ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన, ముఖ్యమంత్రి నిఖా యోజన కింద నవదంపతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు.
– భూమిలేని పేదలకు ఇంటిస్థలాల నిమ్తితం రానున్న బడ్జెట్ సమావేశంలో బిల్లు. భూమి లభ్యం కాకపోతే ప్రభుత్వం కొని అయినా ఇస్తుంది. జాగా దొరక్కపోతే బహుళ అంతస్థుల భవనాలు నిర్మించి ప్లాట్లు కేటాయిస్తుంది.
– గృహనిర్మాణం నిమిత్తం భూమిలేని వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.20లక్షలు, టాయిలెట్‌కు రూ. 12 వేలు ఇవ్వబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో రూ.3 లక్షలు ఇస్తారు – అందులో సగం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది.
– ప్రతి ఏటా 7.5 లక్షల మందికి వృత్తినైపుణ్యాభివృద్ధి శిక్షణ. స్వయం ఉపాధి పథకం కింద అంతేమందికి రుణాలు.
నల్లధనంపై ప్రధానమంత్రి చర్యను గట్టిగా సమర్థి స్తూ, సంపన్నులు-పేదల మధ్య వ్యత్యాసం పెరగటానికి కాంగ్రెస్ కారణమంటూ ఒక రాయి విసిరారు. ప్రధానమంత్రి చెప్పి నట్లు ‘జన్-ధన్’ బ్యాంకు ఖాతాల్లో సంపన్నులు డిపాజిట్ చేసిన ధనాన్ని తిరిగి ఇవ్వవద్దని పేదలను కోరారు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత సాధించే నిమిత్తం రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చౌహాన్ చెప్పారు.

– ఎల్.ఎస్.హర్దేనియ