Home జాతీయ వార్తలు ఆస్పత్రిలో చేరిన గిలానీ

ఆస్పత్రిలో చేరిన గిలానీ

GELANI

శ్రీనగర్ : వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి గిలానీకి ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయన స్కిమ్స్ ఆస్పత్రిలో చేరారని ఆయన సన్నిహితులు తెలిపారు. 87 ఏళ్ల గిలానీకి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.