Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

చిన్నారి ప్రాణాలు తీసిన ఊయల

Saree-Cradleఖానాపురం : వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఊయలకు కట్టిన చీర మెడకు చుట్టుకుని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. ఊయలకు కట్టిన చీర మెడకు చుట్టుకుని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్, సోమలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గురువారం సాయంత్రం ఇంటి వద్ద చీరతో కట్టిన ఊయల ఊగుతుండగా పెద్ద కుమార్తె శ్రీలక్ష్మి మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకుపోయింది. కాసేపటకి చిన్నారి కిందపడి కొట్టుకుంటుండగా గమనించి తల్లి.. శ్రీలక్ష్మిని సర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Comments

comments