Home అంతర్జాతీయ వార్తలు పాము కాటుతో యువతి దుర్మణం..

పాము కాటుతో యువతి దుర్మణం..

Girl Dies With Bite A Snake In China

బీజింగ్: చైనాకు చెందిన ఓ యువతి  పాము కాటు వేయడంతో దుర్మణం చెందింది. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాము విషంతో వైన్ తయారు చేసుకొని తాగడం అలవాటు. ఈ అలవాటే ఆ యువతి ప్రాణం తీసింది. వివరాలలోకి వెళితే.. చైనాలోని షాంగ్జీ ఏరియాకు చెందిన 21యేళ్ల యువతి మంగళవారం ఈ కామర్స్ సంస్థలో అత్యంత విషపూరిత పామును ఆర్డర్ ఇచ్చింది. డెలివరి అనంతరం ఇంటికి వచ్చిన పామును యువతి వైన్ ఉన్న పాత్రలో వేసింది. అయితే ఆ పాము ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి యువతిని కాటేయడంతో మృతి చెందినట్లు ఆమె తల్లి జిన్‌హువా తెలిపారు.