Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ప్రాణం తీసిన ప్రియురాలు…

                 Lover

అమరావతి: గుంటూరు జిల్లా తాటికొండ లో ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో ప్రియుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బాధితుడు ఇలియాస్, హిమబిందు రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఇలియాస్‌కు రెండో రోజుల క్రితం మరో యువతితో వివాహం జరిగిందని హిమబిందుకు తెలిసింది. దీంతో హిమబిందు మంగళవారం అతడికి కాల్ చేసి వెనిగండ్లలోని తన స్నేహితుడి ఇంటికి రమ్మని కబురు పంపింది. ఇలియాస్ రాగానే అతడిపై యాసిడ్‌తో దాడి చేసింది. దీంతో అతడు బయటకు పరుగులు తీయడంతో…దొంగ అనుకొని స్థానికులు పట్టుకున్నారు. తనపై యాసిడ్ దాడి జరిగిందని స్థానికులకు చెప్పాడు. స్థానికులు 108కి సమాచారమిచ్చి అతడిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలియాస్ ఇవాళ ఉదయం మృతి చెందాడు.

Comments

comments