Home జాతీయ వార్తలు ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని.. పెళ్లి మండపం కాల్చేసింది..!

ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని.. పెళ్లి మండపం కాల్చేసింది..!

LOVE..LOVE

పుణె : తనను ప్రేమించిన యువకుడు తనను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో ఓ యువతి పెళ్లి మండపాన్ని దహనం చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో చోటు చేసుకుంది. పుణెకి చెందిన దీపక్, సుష్మాలు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్లి అనగానే దీపక్ ప్లేటు ఫీరాయించాడు. అంతేకాక మరో యువతితో పెళ్లికి సిద్ధమై ఆ శుభలేఖ పట్టుకుని నేరుగా సుష్మా వద్దకే వెళ్లాడు.

దీంతో ఆగ్రహంతో సుష్మా ఆ పెళ్లి పత్రికను చించేసింది. మరుసటి రోజు దీపక్‌ బైక్‌ దహనం చేసింది. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోబోతున్న ఫంక్షన్‌హాల్‌కి వెళ్లి మండపాన్ని దహనం చేసేసింది. దీంతో భయంతో దీపక్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే పరారీలో ఉన్న సుష్మాను పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.