Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పెళ్లికొడుకు తలపై తుపాకీ గురిపెట్టి… కిడ్నాప్ చేసిన రివాల్వర్ రాణి

             Bride-Groom

బుందేల్‌ఖండ్: ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన మన తెలుగు సినిమా కథను తలపిస్తోంది.  తెలుగు సినిమా కథా సుఖాంతంలో హీరో వచ్చి పెళ్లి మండపంలో ఉన్న హీరోయిన్ తీసుకెళ్లుతున్నట్లుగా ఉంటుంది ఈ స్టోరీ. కాకపోతే ఇక్కడ హీరో స్థానంలో ఓ లేడీ ఉంటుంది అంతే. ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో ఓ యువతి పెండ్లి మండపానికి తుపాకీతో వచ్చి పెండ్లి కొడుకు తలకు గురి పెట్టి కిడ్నాప్ చేసింది. దీంతో పెండ్లి మండపంలో ఉన్న బంధువుల, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు.

వరుడు గతంలో ఓ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ప్రేమించిన అమ్మాయి కిడ్నాప్ చేసిందని స్థానికులు తెలిపారు. పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోవడంపై పెండ్లి కూతురు స్పందిస్తూ ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని తెలిపింది. ఓ అమ్మాయిని మోసం చేసినందుకు వరుడికి తగిన శాస్త్రి జరిగిందని పేర్కొంది. వెంటనే వరుడి తరుపు బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారి మాత్రం కిడ్నాప్ చేసిన యువతిని రివాల్వర్ రాణి అని పొగిడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments