Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రియురాలి మోజులో తల్లిని చంపిన కూతురు!

murder

లక్నో: సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఇది. అనైతిక సంబంధానికి(మహిళా లెక్చరర్‌తో సహజీవనం) అడ్డుపడిందని కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. ఈ దారుణ ఘటన యుపిలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఘజియాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి తన కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా ఆమెతోనే సహజీవనం చేస్తోంది. ఈ విషయం కాస్తా బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను పద్ధతి మార్చుకోవాలని మందలించారు. దీంతో తమ సంబంధానికి అడ్డుపడుతున్న తల్లిపై కోపం పెంచుకుందామె. ఈ క్రమంలో పథకం ప్రకారం ఈ నెల 9న కన్నతల్లి అనే కనికరం చూపకుండా కర్రలు, రాడ్‌తో దాడిచేసి అక్కడి నుంచి పరారైంది. కూతురు చేతిలో తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఈ ఘటనపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కూతురే హతమార్చిందని, లెక్చరర్‌తో లైంగిక సంబంధానికి అడ్డు చెప్పిందని ఈ దారుణానికి పాల్పడినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితురాలితో పాటు మహిళా లెక్చరర్ కోసం గాలిస్తున్నారు.

Comments

comments