Home హైదరాబాద్ మియాపూర్ లో యువతి అదృశ్యం

మియాపూర్ లో యువతి అదృశ్యం

Girl missing in Miyapur

మియాపూర్ : ఓ యువతి గుడి వెళ్ళి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… మియాపూర్ జనప్రియ వెస్ట్‌సిటిలో నివాసముండే కట్టెల శివలక్ష్మి కుటుంబంతో నివాసముంటుంది. కట్టెల శివలక్ష్మి కూతురు కట్టెల స్వాతి (19) సోమవారం ఉదయం 10 గంటలకు దేవాలయంకు వెళ్తున్నానని తెలిపి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. ఎంతసేపటి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద యువతి అచూకి లభ్యంకాకపోవడంతో మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.