Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

బాలికపై అత్యాచారం … హత్య

Girl Murder after Rape in Maharashtra

ముంబయి : మహారాష్ట్రలోని భివాండిలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. బాలిక రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Girl Murder after Rape in Maharashtra

Comments

comments