Home జాతీయ వార్తలు బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

RAPEలక్నో : ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. తుపాకీతో బెదిరించి ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు యువకులు బాలిక ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. సకీబ్, రకీబ్‌లను నిందితులుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.