Home జాతీయ వార్తలు యువతికి మత్తుమందు ఇచ్చి ఆపై…

యువతికి మత్తుమందు ఇచ్చి ఆపై…

Girl Raped

చెన్నై: తమిళనాడులోని  మరో కీచకపర్వం వెలుగు చూసింది. వెలిపాళయంపేటకు చెందిన సెంథిల్‌కుమార్‌ కుమారుడు సుందర్‌ (22) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం ఏర్పడి ఆ  పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్దికాలం కాలంగా ఆ యువతి సుందర్‌ కు దూరంగా ఉంటుంది. అయితే సుందర్‌ ఆమెకు మాయమాటలు చెప్పి మళ్లీ ప్రేమ వ్యవహారం నడిపాడు. కారైక్కాల్‌ ఆలయానికి ఆమెతో వెళ్లిన సుందర్‌ అక్కడ లాడ్జీలో బస చేశాడు. మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని తాగించాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం సుందర్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తూ ఆ సన్నివేశాలను వీడియో తీశాడు. అనంతరం స్పృహ వచ్చిన యువతి జరిగిన విషయం తెలుసుకొని సుందర్‌ను నిలదీసింది. దీంతో సుందర్ ఆమెకు వీడియో దృశ్యాలు చూపించి బెదిరించాడు. దీంతో ఆ యువతి అతనికి దూరంగా వుండాలని అనుకుంది. కానీ వీడియో బయట పెడతానని బెదిరించి ఆమెపై పలుమార్లు సుందర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సుందర్ వేధింపులను తట్టుకోలేని యువతి కీళవెల్లూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Girl Raped By Lover In Tamil Nadu