Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సభలో మార్మోగిన గాయత్రీ మంత్రం…

Nawaz-Sharif

ఇస్లామాబాద్: హోలీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాల్గొనగా, ఈ సభలో ఓ యువతి గాయత్రీ మంత్రాన్ని ఆలపించింది. దీంతో సభ ప్రాంగణం గాయత్రీ మంత్రంతో మార్మోగిపోయింది.

మరిషాస్ మాలిని అనే యువతి మంత్రాన్ని పాడినంతసేపు వేదికపై ఉన్న షరీఫ్‌తోపాటు కార్యక్రమానికి హాజరైన ఆహ్వానితులందరూ ఆధ్యాత్మిక భావనలో మునిగితేలారు.

ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామన్నారు. అలాగే ఇస్లామ్‌లో మత మార్పిడిలను నేరంగా పేర్కొన్నారు. యువతి ఆలపించిన గాయత్రీ మంత్రం ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తూ వైరల్ అయింది. మీ కోసం ఈ వీడియో…

Comments

comments