Home జాతీయ వార్తలు రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాలిక

రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాలిక

Letter1లక్నో: తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 15 ఏళ్ల బాలిక రక్తంతో లేఖ రాసింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించింది. పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బులంద్షార్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మగసంతానానికి జన్మనివ్వలేదని కారణంతో తన తల్లికి నిప్పుపెట్టి చంపారని తెలిపింది. మా నాన్న బనోజ్ బన్సాల్, ఇతర కుటుంబ సభ్యులు తన చెల్లిని పక్క గదిలో బంధించి మా అమ్మను చంపారని పేర్కొంది. పోలీసులు మాకు సాయం చేయకపోగా నిందితులను రక్షిస్తున్నారని తెలియజేసింది. ఈ కేసును విచారణ జరుపుతున్నామని ఆధారాలు లభిస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బులంద్షార్ ఎస్‌పి అనీస్ అన్సారీ తెలిపారు.