Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడిపై యాసిడ్ దాడి.. ప్రియురాలు అరెస్టు

Lovers

గుంటూరు: ఎపిలోని గుంటూరు జిల్లాలో ప్రియుడికి యాసిడ్ తాగించి హత్య చేసిన హిమబిందు అనే యువతిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మంగళగిరి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన ఖాసీం, అర్జున్ అనే యువకులను కూడా అరెస్టు చేశారు.

సత్తెనపల్లి దగ్గర హిమబిందును, ఆమె స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. కొన్ని గంటల్లోనే గుంటూరు పోలీసులు ఈ కేసును ఛేదించారు. నాలుగేళ్లు తనను ప్రేమించి రెండు రోజుల క్రితం మరో అమ్మాయిని పెళ్లాడిన ప్రియుడి ఇలియాస్‌ని హిమబిందు పథకం ప్రకారం యాసిడ్ తాగించి చంపేసిన ఘటన బుధవారం గుంటూరు జిల్లా తాటికొండలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Comments

comments