Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడికి చెప్పుతో దేహశుద్ధి.. ఆపై పెళ్లి!

Lovers

అమరావతి: తనను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రేమికుడికి దేహశుద్ధి చేసి మరి తాళి కట్టించుకుంది ఓ ప్రేయసి. ఈ ఘటన ఎపిలోని కర్నూలు జిల్లా నంద్యాలలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే… స్థానిక పాణ్యంలోని రాంభూపాల్‌రెడ్డి కాలనీకి చెందిన దివ్యాబాయి, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలు తెలియడంతో వారు అడ్డు చెప్పారు. దాంతో దివ్యా, చంద్రశేఖర్ రహస్యంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ తన మేనత్త కూతురిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయం కాస్తా దివ్యాబాయికి తెలిసింది. దాంతో నంద్యాలలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. అక్కడ చంద్రశేఖర్ తేడాగా మాట్లాడటంతో దివ్యా చెప్పుతో దేహశుద్ధి చేసింది. అనంతరం తనకు తగిన న్యాయం చేయాలని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసింది. దీనిపై వెంటనే స్పందించిన పెద్దలు టెక్కెలోని సుంకులమ్మ దేవాలయంలో వారి వివాహం జరిపించారు. కాగా, యువతి చూపించిన తెగువను అక్కడి వారందరూ ప్రశంసించారు.

Comments

comments