Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి కోసం సెల్ టవర్ ఎక్కిన యువతి!

Girlfriend climb Cell Tower in the name of Boyfriend Cheating

యాదాద్రి భువనగిరి: ప్రేమించిన వాడు మోసం చేశాడంటూ న్యాయం కోసం ఓ యువతి సెల్ టవర్ ఎక్కిన వైనమిది. ప్రేమించినప్పుడు తనతో సరదాగా ఉన్నావాడు, పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ యువతి ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కడం కలకలంగా మారింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే ప్రేమ పేరుతో సరదాగా సమయం గడిపిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తేసరికి దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో జ్యోతి తనను పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌పై ఒత్తిడి చేసింది. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో తాను మోసపోయానని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా ప్రయోజనం లేదని జ్యోతి వాపోయింది. ఇప్పుడు భాస్కర్ వెేరే యువతితో పెళ్లికి సిద్ధపడుతున్నాడంటూ అతడి ముందు గత మూడు రోజులుగా ఆందోళన చేసింది. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతి స్థానిక వెంకటేశ్వర  సినిమా థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

Comments

comments