Home జయశంకర్ భూపాలపల్లి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Lovers-Commits-Suicide

జయశంకర్ భూపాలపల్లి: ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా, ప్రియుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషం తాగిన ఈ జంటను చూసిన స్థానికులు చికిత్స కోసం వరంగల్ ఎంజిఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రియురాలు హరిప్రియ(17) మృతి చెందింది. ప్రియుడు సాయికుమార్(18) పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. హరిప్రియ మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయికుమార్, హరిప్రియ ఇద్దరి స్వస్థలం హన్మకొండ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.