Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా!

Girlfriend Protest in front Boyfriend's Home in Nalgonda District

నల్గొండ: ప్రేమ పేరుతో తనను మోసం చేసిన ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే జడిగల హరీశ్ అనే యువకుడు సదరు యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి ప్రియుడి వద్ద ఇటీవల పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అప్పటి నుంచి యువతిని దూరంగా పెడుతున్నాడు యుకుడు. అంతేగాక యువతితో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధిత యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కూడా యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Comments

comments