Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

Girlపెళ్లి చేసుకుంటానని పారిపోయిన ప్రియుడికోసం ప్రియురాలి బైఠాయింపు
తనకు న్యాయం జరిగే వరకూ వెళ్లనని ప్రియుడి ఇంటి ముందు పోరాటం

మల్యాల : పెళ్ళి చేసుకుంటానని పారిపోయిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన సంఘటన మల్యాల మండలంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లి మండలం రాఘవప్నటం గ్రామానికి చెందిన వనిత, మల్యాల మండలంలోని రాంపూర్‌కు చెందిన సంజీవచారి రాఘవపట్నానికి ఓ పెళ్ళి చేయడానికి పురోహితుడిగా వచ్చాడు. దాంతో అతనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా చిగురించింది. తనను వివాహం చేసుకుంటానని తరుచూ చెప్పడంతో యువకుడి మాటలు నమ్మి బట్టలు, కొంత డబ్బు, బంగారంతో తాను ఇంటి నుండి సంజీవచారి తన ద్విచక్ర వాహనంపై గత శుక్రవారం తీసుకువచ్చాడు. మార్గమధ్యంలో జగిత్యాల సమీపంలో వదిలేసి బంగారం, డబ్బులు తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. దాంతో చేసేదేమి లేక ఇంటికి వెళ్ళిపోయాను. సంజీవ్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో న్యాయం కోసం సోమవారం అతడి ఇంటికి వచ్చి ఆరా తీయగా సంజీవచారి తనను వదిలేసి వెళ్ళినప్పటి నుండి ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళేది లేదని ఇంటి ముందు బైఠాయించింది.

Comments

comments