Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా

Girlfriend strike in front of Boyfriend House in Mahabubabad District

మహబుబాబాద్: ప్రేమ పేరుతో తనను మోసగించిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన దీక్షకు దిగిన ఘటన మహబుబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం అబ్బాయిపాలెం దళిత కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా ఉండే సమ్మక్క, ప్రభాకర్ గత ఐదు సంత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ ఇంటిలోనే సమ్మక్క తల్లిదండ్రులు కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. దీంతో సమ్మక్క, ప్రభాకర్ మరింత దగ్గరయ్యారు. సమ్మక్కను వివాహం చేసుకుంటానని ప్రభాకర్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. దాంతో కొన్నిరోజులుగా సమ్మక్క తనను పెళ్లి చేసుకోవాలని ప్రభాకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీనికి ప్రభాకర్ ఒప్పుకోకపోవడంతో అతడి ఇంటి ఎదుట సమ్మక్క మౌన దీక్షకు దిగింది. స్థానికుల ద్వారా విషయం తెలుకుని ఎస్‌ఐ ప్రసాధరావు అక్కడికి వచ్చారు. అనంతరం ప్రభాకర్, సమ్మక్కల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దాంతో వారిరువురు వీరి పెళ్లికి అంగీకరించారు.

Comments

comments