Home మహబూబాబాద్ ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

Lovers

నర్సింహులపేట: తనను ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన దారెల్లి మదూష గురువారం ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రామన్నగూడెం గ్రామానికి చెందిన దారెల్లి సోమయ్య-భద్రమ్మ దంపతుల కూమార్తె మదూష మండలంలోని ముంగిమడుగు శివారు నర్సింహాపురం బంజరకు చెందిన రమణబోయిన వెంకన్న-పద్మల కుమారుడు జాన్  గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరు మేజర్ కావడంతో వివాహం చేసుకోవడానికి యువకుని కుటుంబ సభ్యులు కులాంతర వివాహం అని అంగీకరించలేదు. దీంతో ఇరువురు భద్రాచలం వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజల తరువాత జాన్ కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. యువకుని తల్లిదండ్రులు అంగీకరించి మరలా పెద్దల సమక్షంలో వివాహం చేస్తామని చెప్పి నమ్మించి మదూషను వారింటికి పంపించారు.

వివాహానికి ఒకరోజు నిర్ణయించి ఆరోజు వివాహం చేస్తామని చెప్పి తీరా మదూష, ఆమె తల్లిదండ్రులు ప్రియుడు ఇంటికి రావడంతో ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో ప్రియురాలు ఆందోళన చేపట్టింది. వివాహం అయ్యే వరకు ఆందోళనను విరమించనని మదూష తెలిపింది. మదూషకు మద్దతుగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.