Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

Girlfriend's Protest before the boyfriend house
టేకులపల్లి: తనను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నిరారిస్తున్నాడని పేర్కొంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న ఘటన ఆదివారం మండల పరిధిలోని జేత్యాతండాలో చోటుచేసుకుంది. ఆమెకు మద్ధతుగా మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కాగా ప్రియుడు కుటుంబ సభ్యులు మాత్రం తమ ఇంటికి తాళం వేసి జారుకున్నారు. వివరాలు… ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెద్ద లచ్చాతండా గ్రామానికి చెందిన అజ్మీర అమలకు, టేకులపలిల మండలం కోయగూడెం పంచాయితీ జేత్యాతండాకు చెందిన బానోతు శివ(శివాజీ) కి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. వారు పెళ్లి కూడా చేసుకున్నారు. వారి ఇరువురి పంచాయితీ పలుమార్లు గ్రామంలో పెద్దల సమక్షంలోను, కామేపల్లి పోలీస్ స్టేషన్‌లోను జరిగాయి. కాగా ఆదివారం అమల, తన ప్రియుడు/భర్త శివ ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈమె దీక్షకు ఆమె గ్రామం నుంచి సుమారు యాభై మంది మహిళలు మద్దతుగా వచ్చి, దీక్షకు సంఘీభావంగా నిలిచారు. ఈ సందర్భంగా అమల విలేరులతో మాట్లాడుతూ తమ మధ్య 2013 లో పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని అప్పటి నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నామని ఆమె చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తాము పెళ్లి చేసున్నామని ఆమె పేర్కొంది. కాని తనను నిరాకరిస్తున్నాడని, అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చి, దీక్షకు పూనుకున్నట్టు ఆమె వివరించింది. కాగా విషయం తెలిసి, స్ధానిక ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో దీక్షా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా అమల దీక్ష కొనసాగుతోంది.

Comments

comments