Search
Thursday 18 October 2018
  • :
  • :

పదేళ్ళు దాటిన అమ్మాయిలు జీన్స్ ధరించవద్దు.!

ph

భోపాల్ : పండగలప్పుడు, వేడుకలప్పుడు మాత్రమే సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పా మిగతా రోజుల్లో వీటిని చూడటం గగనమైపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని మాలి తెగకు చెందిన పెద్దలు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, టాప్‌లు ధరించవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్ పూర్ కులానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మంజుల మాలి సూచించారు. నవరాత్రుల్లో భాగంగా మాలి తెగ గర్బా వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గర్బా వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నామని, అయితే ఈ  వేడుకలో పాల్గొనే మహిళలు, యువతులు జీన్స్‌ ధరించకూడదని నిబంధన విధించామని తెలిపారు. ఇకమీదట ఇదే నిబంధన కొనసాగుతుందని, ఆడపిల్లలు వారింట్లో కూడా జీన్స్‌ ధరించడం నిషేధించడం జరిగిందని ఆమె తెలిపారు. ఇకనుంచి ఏ పండగలకూ వారు జీన్స్ ధరించడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. జీన్స్ ప్యాంట్లు, టాప్‌లు ధరించడం వలన అబ్బాయిలు అమ్మాయిలను సరిగా చూడటం లేదని, దీన్ని బాలికలు అర్థం చేసుకోవాలని కోరారు. అందువల్లనే అమ్మాయిలు లక్షణమైన వస్త్రధారణ ఉండేలా చూసుకోవాలని తాము సూచించామని మంజుల పేర్కొన్నారు.

Comments

comments